ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడి ప్రాణం తీసిన రాతి గుండు.. కసరత్తు చేస్తుండగా ప్రమాదం - కర్నూలు జిల్లా క్రైం వార్తలు

ఏటా దసరాకు ముందు.. కర్నూలు జిల్లా గొలుగొండ గ్రామంలో రాతి గుండు ఎత్తే పోటీలు జరుగుతాయి. కొన్ని నెలల ముందు నుంచే యువకులు ఆ పోటీ కోసం కసరత్తు చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో పట్టుతప్పిన ఓ వ్యక్తి.. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే చనిపోయాడు.

A man died with lifting the stone at golugonda, kurnool district
రాతి గుండె ఎత్తబోయి ప్రాణం కోల్పోయిన వ్యక్తి

By

Published : Jul 5, 2020, 3:30 PM IST

రాతి గుండు ఎత్తి.. పట్టుతప్పిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా గొలుగొండ గ్రామంలో జరిగింది. సాహెబ్ అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. దసరాకి ముందు గ్రామంలో జరిగే ఉత్సవాల్లో రాతి గుండు పోటీలు నిర్వహిస్తుంటారు.

వాటికి ఇప్పటి నుంచే గ్రామస్తులు సాధన చేయడం మొదలు పెట్టారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం రాతి గుండు ఎత్తి వెళ్తున్న సమయంలో వేళ్లు పట్టు తప్పి.. ఆ గుండు పూర్తిగా సాహెబ్ పై పడింది. తీవ్ర గాయాలపాలైన సాహెబ్.. అక్కడిక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details