కర్నూలు జిల్లా నంద్యాల ప్రియాంక నగర్లో ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులో పని చేస్తుండగా గోవర్ధన్ (20 )అనే కార్మికుడు మృతి చెందాడు. అన్నదమ్ములు సత్యనారాయణ, రాజేష్ అస్వస్థతకు గురయ్యారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే గోవర్ధన్ గత నెల రోజుల నుంచి సెప్టిక్ ట్యాంకులో పూడిక తొలగించే పనికి వెళుతున్నాడు.
పని చేసే క్రమంలో గోవర్ధన్ ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అస్వస్థతకు గురైన మరో ఇద్దరు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల వైస్.నగర్‌కు చెందిన గోవర్ధన్‌కు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతనికి భార్య, నాలుగు నెలల పాప ఉంది.