ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి దుర్మణం - రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి మృతి

బైకును ఓ లారీ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా అవుకు సమీపంలోని రిజర్వాయర్ వద్ద జరిగింది.

a man died in a road accident at owk reservoir Kurnool district
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి దుర్మణం

By

Published : Sep 29, 2020, 4:03 PM IST

కర్నూలు జిల్లా అవుకు మండల ఓబులాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగారెడ్డి (30) ద్విచక్రవాహనంపై అవుకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని అవుకు ఎస్సై శ్రీకాంత్​రెడ్డి పరిశీలించారు. మృతుడి భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి (30).. రెండేళ్ల క్రితం సుధారాణిని వివాహం చేసుకున్నారు. పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న రంగారెడ్డిని లారీ రూపంలో మృత్యువు కబళించింది.

ABOUT THE AUTHOR

...view details