ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు - Two bikes collided at kurnool

కర్నూలు జిల్లా ఎర్రకోట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బావమరిదిగా గుర్తించారు.

Two bikes collided at kurnool
రెండు బైకులు ఢీ

By

Published : Jun 16, 2021, 2:09 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.ప్రసాద్(60) మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎం.వి.ప్రసాద్ మే31న పదవీ విరమణ పొందారు. పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ద్విచ్రవాహనంపై కర్నూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బావమరిదిగా గుర్తించారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details