శ్రీశైలం ఆలయ పరిసరాల్లో భక్తులకు ప్రమాదం తప్పింది. దక్షిణ మాడ వీధిలో నెయ్యి క్యాన్ లను దించేందుకు వచ్చిన ఓ లారీ అదుపు తప్పింది. బ్రేకులు ఫెయిల్ అయిన లారీ.. డొనేషన్ కౌంటర్, శీఘ్ర దర్శనం క్యూలైన్ల వద్ద నుంచి దూసుకు (lorry crashes into the vicinity of Srisailam temple) వచ్చింది. దేవస్థానం సిబ్బంది, సెక్యురిటీ గార్డులు కేకలు వేసి.. భక్తులను లారీకి దూరంగా ఉండే విధంగా అప్రమత్తం చేశారు.
ఉచిత దర్శనం క్యూలైన్ ప్రవేశం వద్దకు రాగానే.. లారీ టైర్ల కింద రాళ్లను అడ్డుపెట్టి ప్రమాదం జరుగకుండా సెక్యురిటీ గార్డులు చర్యలు చేపట్టారు. లారీ.. భక్తులు, దుకాణాల మీదకు దూసుకురాకుండా.. డ్రైవర్ సైతం చాకచక్యం ప్రదర్శించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం ఈఓ లవన్న.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన సిబ్బంది, సెక్యురిటీ గార్డులను అభినందించారు.