కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో విషాదం జరిగింది. గ్రామంలో స్నేహితులతో సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ విషయాన్ని తోటి పిల్లలు గ్రామస్థులకు తెలియజేశారు. వారు వచ్చి బయటకు తీసేసరికి చిన్నారి మృతి చెందింది. చిన్నారిది వెల్దుర్తి మండలం అనుగొండ గ్రామం. పెళ్లి కోసమని తాతగారింటికి వచ్చింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది.
డోన్‌లో విషాదం.. చెరువులో పడి చిన్నారి మృతి - crime news in kurnool dst
పెళ్లికి తాతయ్య ఊరికి వచ్చిన చిన్నారి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా డోన్‌లో జరిగింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది.

a girl was died in kurnool dst when swimming in a river