కర్నూలు నగరంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.నగరంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన చందన ప్రియా రాత్రి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.ఆమెని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అప్పటికే చందన ప్రియా మృతి చెందారని వైద్యులు తెలిపారు.చదువుపై ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదువు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య .. - Student suicide by hanging
చదువు ఒత్తిడితో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Student suicide by hanging