కర్నూలు నగరంలోని నంద్యాల గేట్ కాలనీలో సుబ్రమణ్యం శెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కొవెలకుంట్లకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా కర్నూలులో నివాసం ఉంటున్నారు. అవివాహితుడు అయిన సుబ్రమణ్యం అనకాపల్లికి చెందిన శివజ్యోతి అనే అమ్మాయిని 13 సంవత్సరాల క్రితం చేరదీసి పెంచుకుంటున్నాడు. శివజ్యోతి కొవెలకుంట్లలో ఆత్మహత్య చేసుకుంది. విషయం పెంపుడు తండ్రికి తెలియడంతో మానసిక కృంగుబాటుకు లోనై సుబ్రమణ్యం శెట్టి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుబ్రమణ్యం సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెంపుడు కూతురు ఆత్మహత్య...మనస్తాపంతో.. - కర్నూలు జిల్లా క్రైమ్ వార్తలు
తనకు ఎవరూ లేరన్న బాధను మర్చిపోవటానికి 13 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని చేరదీశాడు. అన్నీతానై పెంచి పెద్ద చేశాడు. కన్నకూతురులా చూసుకున్నాడు. బాధ్యతలు అప్పగించి సంతోషంగా ఉంటున్న సమయంలో తాను చనిపోయిందన్న వార్త విన్న పెంపుడు తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది.
పెంపుడు కూతురు చనిపోయిందని మనస్థాపంతో...