కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వగరూరుకు చెందిన దస్తగిరి (55) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరవు పరిస్థితుల కారణంగా వ్యవసాయంలో దాదాపు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అప్పుల వారి ఒత్తిళ్లు భరించలేక పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఆరుగురు సంతానం. ఇంటిపెద్ద మరణించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కర్నూలులో పురుగుల మందు తాగి రైతుఆత్మహత్య - కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం
కరవు రైతన్న కుటుంబంలో విషాదం నింపింది. వ్యవసాయం భారమై..అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకి ప్రాణాలు వదిలిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది
![కర్నూలులో పురుగుల మందు తాగి రైతుఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4518528-274-4518528-1569154662876.jpg)
a farmer died by drunk pesticide at karnool.