ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూటిపల్లెలో శునకానికి అంత్యక్రియలు - కర్నూలు జిల్లాలో శునకానకి అంత్యక్రియలు

కర్నూలు జిల్లా గూటిపల్లె గ్రామానికి చెందిన ముళ్ల కుటుంబ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. పదేళ్లుగా పెంచుకున్న శునకం ఆనారోగ్యంతో మృతి చెందగా దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

a dog cremations at gutipally
కర్నూలు జిల్లాలో శునకానకి అంత్యక్రియలు

By

Published : Nov 9, 2020, 9:12 PM IST

కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గూటిపల్లె గ్రామంలో మృతి చెందిన శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముళ్ల.. ఇటుకల బట్టి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆయనకు శునకాలు అంటే ప్రేమ. పదేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి మాక్సీ అనే పేరు పెట్టి పెంచుకున్నారు. అప్పటినుంచి దాన్ని ఇంట్లో మనిషి వలే చూసుకున్నారు. మాక్సీకి అప్పట్లో చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు. అయితే మ్యాక్సీ అనారోగ్యంతో ఇవాళ మృతి చెందింది. దీంతో ముళ్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మ్యాక్సీకి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details