కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల వద్ద ప్రమాదం జరిగింది. గొల్ల లక్ష్మీరమణ అనే రైతు.. ఎడ్ల బండిపై వెళ్తున్నాడు. అయితే చనుగొండ్ల వద్ద ఇరిగేషన్ కాల్వలో ప్రమాదవశాత్తూ ఆ ఎడ్లబండి పడిపోయింది. ఈ ప్రమాదంలో లక్ష్మీరమణ తప్పించుకోగా.. రెండు ఎద్దులు మృతి చెందాయి. ఎడ్ల బండి, వ్యవసాయ పనిముట్లు సహా నాలుగు వేరుశనగ విత్తనాల సంచులు, మూడు ఎరువు సంచులు నీటిలో మునిగిపోయాయి.
కాల్వలో పడిన ఎడ్లబండి.. రెండు ఎద్దులు మృతి - కాల్వలో పడిన ఎడ్లబండి.. రెండు ఎద్దులు మృతి
కర్నూలు జిల్లా చనుగొండ్ల వద్ద ఇరిగేషన్ కాల్వలో ప్రమాదవశాత్తూ ఎడ్లబండి పడిపోయింది. ఈ ప్రమాదంలో రైతు గొల్ల లక్ష్మీరమణ తప్పించుకోగా.. రెండు ఎద్దులు మృతి చెందాయి.
కాల్వలో పడిన ఎడ్లబండి.. రెండు ఎద్దులు మృతి