ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్.. ప్రమాదంలో బాలుడు మృతి - కర్నూలు తాజా న్యూస్

వేగంగా వస్తున్న ట్రాక్టర్.. విద్యుత్ స్తంభాన్ని డీకొట్టింది. ఆ స్తంభం విరిగి.. పక్కనే ఉన్న బాలుడిపై పడి.. అతడిని బలితీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడి మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పగిడ్యాలలో జరిగింది.

a-boy-was-killed-when-a-power-pole-fell-on-him-at-pagidyala-in-kurnool-district
విద్యుత్ స్తంభం పడి బాలుడు మృతి... శోకసంద్రంలో కుటుంబం...

By

Published : Jan 27, 2021, 6:45 AM IST

విద్యుత్ స్తంభం విరిగి పడిన ఘటనలో.. బాలుడు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పగిడ్యాలలో జరిగింది. గ్రామానికి చెందిన వివేక్ చంద్ర (5).. తన పెదనాన్న ఇంటి వద్ద మెట్లపై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రాక్టర్.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విరిగిన ఆ స్తంభం.. మెట్ల పై కూర్చున్న చిన్నారిపై పడింది. రక్తపు గాయాలతో కుప్పకూలిన వివేక్​ను చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

చిన్నారిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. వివేక్ చంద్ర పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో జన్మించగా.. ఈ మధ్యనే చికిత్స చేయించారు. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడి మరణంతో వివేక్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details