ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో విషాదం.. ఆటో ఢీ కొని ఐదేళ్ల బాలుడి మృతి - ఐదేళ్ల బాలుడి మృతి

Boy Died In Road Accident : కర్నూలు జిల్లాలో ఆటో ఢీ కొని బాలుడు మృతి చెందాడు. అంతసేపు తల్లిదండ్రులతోనే ఉన్న బాలుడ్ని ఒక్కసారిగా ఆటో ఢీ కొట్టింది. కుటుంబసభ్యులు చూస్తుండగానే జరిగిన ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే బాలుడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

five years boy died
ఐదేళ్ల బాలుడి మృతి

By

Published : Jan 23, 2023, 9:54 AM IST

A Boy Died : కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటో ఢీ కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పొయాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో ఆ బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాలుడి తల్లిందండ్రులు పొలం పనులకోసం వెళ్తు.. అతడ్ని వెంట తీసుకువెళ్లారు. ఈ క్రమంలో బాలుడ్ని ఆటో ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పొయాడు.

కోసిగి గ్రామానికి చెందిన రామాంజి, హనుమంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అంజి సంతానం. వీరి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వీరు పొలం పనులకోసం పెద్దకడబూరు మండలం బాపులదొడ్డికి పనుల కోసం వెళ్లగా అక్కడ అంజిని ఆటో ఢీ కొట్టింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజి, హనుమంతమ్మ దంపతులు కోసగి నుంచి ఆటోలో బాపులదొడ్డి సమీపంలో పొలం పనులకు వెళ్లారు. వారితో పాటు అంజిని వెంట తీసుకుని వెళ్లారు.

ఈ క్రమంలో ఆటో దిగిన వీరు పొలంలోకి వెళ్తుండగా రోడ్డుపై వచ్చిన మరో ఆటో అంజిని ఢీ కొట్టింది. దీంతో బాలునికి తలకు తీవ్రగాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు. పరిస్థితి విషమించటంతో ఆదోనిలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పొయాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క కొడుకుని ఎన్నో ఆశలతో పెంచుకుంటున్నామని.. బాలుడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details