ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంటపడి దాడి చేసిన ఎలుగుబంటి.. ఆస్పత్రికి తరలింపు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లా మహానంది పరిధి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

bear attack
ఎలుగుబంటి దాడి

By

Published : Apr 22, 2021, 12:42 PM IST

Updated : Apr 22, 2021, 12:48 PM IST

కర్నూలు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. మహనందికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి నన్నారి షర్భత్ (శీతల పానీయాలు) తయారు చేసేందుకు అవసరమైన వేర్ల సేకరణకు వెళ్లగా ఎలుగుబంట్లు వెంటపడ్డాయి. భయాందోళనకు గురైన ఇద్దరు వ్యక్తులు చెట్టు ఎక్కారు.

చెట్టు ఎక్కడం రాకపోవడంతో..

ఈ క్రమంలో వెంకటేశ్వర్లుకు చెట్లు ఎక్కడం రాకపోవటంతో.. తప్పించుకునేందుకు పరుగెత్తాడు. ఈ క్రమంలో ఎలుగు బంటి వెంట పడి దాడి చేసి గాయపరిచింది. ఈ నేపథ్యంలో బాధితుల వెంట ఉన్న కుక్కలు ఎలుగుబంట్లకు ఎదురు తిరిగాయి. ఫలితంగా అవి పరుగు లంకించుకోవడంతో బాధితులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇదీ చదవండీ..ఓపెన్‌ రీచ్‌లలో తవ్వకాల నిలిపివేత.. ఇసుక దొరక్క కష్టాలు

Last Updated : Apr 22, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details