ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడికి వెళ్లొద్దన్న అన్నయ్య.. చెల్లి ఆత్మహత్యాయత్నం! - ఏపీ వార్తలు

"పాఠశాలకు వెళ్లను... నాకిష్టం లేదు" అనే వాళ్లను చూస్తూనే ఉంటాం. "బడికి వెళ్లకపోవటంతో హెచ్చరించిన కుటుంబసభ్యులు.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి" అనే వార్తలను కూడా విని ఉంటాం..! కానీ కర్నూలు జిల్లాలో మాత్రం.. పాఠశాలకు వెళ్లొద్దని చెప్పటంతో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన వెలుగు చూసింది.

student suicide attempt in kurnool district
student suicide attempt in kurnool district

By

Published : Feb 21, 2022, 10:15 PM IST

పాఠశాలకు వెళ్లొద్దని చెప్పటంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు వలస వెళ్లారు.

తాను మాత్రం సొంత అన్నతో కలిసి గ్రామంలోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే.. బడికి వెళ్లే విషయంలో అన్నా చెల్లెలు ఘర్షణ పడ్డారు. బడికి వెళ్లొద్దని అన్న తేల్చి చెప్పడంతో.. మనస్థాపానికి గురైన చెల్లి.. క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్యహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతోందని విద్యార్థిని మేనత్త వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details