ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం: ఆరు గేట్లు ఎత్తి నీరు విడుదల

శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు తగ్గుతోంది. ఇన్​ఫ్లో 2,77,790 క్యూసెక్కులు ఉండగా...ఔట్​ ఫ్లో 2,32,847 క్యూసెక్కులుగా ఉంది. ఆరుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

శ్రీశైలం జలాశయంలో 6గేట్లు ఎత్తి నీరు విడుదలు
శ్రీశైలం జలాశయంలో 6గేట్లు ఎత్తి నీరు విడుదలు

By

Published : Aug 24, 2020, 7:01 PM IST

శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు తగ్గుతోంది. జలాశయానికి ఇన్ ఫ్లో 2,77,790 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో... 2,32,847 క్యూసెక్కులుగా ఉంది. 6 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31,229, హంద్రీనీవా ద్వారా 2026, పోతిరెడ్డిపాడు ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని పంపుతున్నారు.

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883.60 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 207.84 టీఎంసీలుగా నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details