ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి చాలా పొదుపు మనిషి ఉన్నట్టున్నాడు. ముందు ఇద్దరు.. వెనకొ నలుగురు చిన్నపిల్లలను బైక్పై ఎక్కించుకున్నాడు. దర్జాగా నడిరొడ్డుపై షికార్లు కొడుతున్నాడు. పైగా హెల్మెట్ లేదు. కాస్త పట్టుతప్పిన ఏం జరుగుతుందో ఊహించడానికి భయంగా ఉంది. ఏదైనా జరిగితే.. ఏడవడం తప్ప చేసేదేముంది. అలా వెళ్లడం పిల్లలకు సరదా కావొచ్చు. ఆ సరదాను ప్రాణాలమీదకు తెచ్చే పని చేయడం తప్పు. ట్రాఫిక్ రూల్స్ అంటూ.. చెప్పే మాటలు నోటికే పరిమితవుతున్నాయి. ప్రాణాల మీదకు తెచ్చేలా.. బైక్పై రాజుల స్వారీ చేస్తున్న మీకు దండాలు. ఈ ఫొటో కర్నూలు జిల్లా ఆదోనిలోనిది.
వీరు చాలా పొదుపు వ్యక్తిలా ఉన్నారు..! - త్రిబుల్ రైడింగ్ న్యూస్
బైక్పై త్రిబుల్ రైడింగ్ వెళ్లడమే తప్పు. వెళ్లొద్దు... ప్రమాదం. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురు చిన్నపిల్లలను తన బైక్పై ఎక్కించుకున్నాడు. తనతో కలిపి ఏడుగురు. ముందు.. వెనకా.. కావల్సిన వాళ్లు ఉండాలనే పెద్దల మాటకు కట్టుబడి ఉన్నట్టున్నాడు. ఇంతకీ ఇదెక్కడి ఫొటో అంటే..?
6 childres on one bike