కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్లలో 14 రోజులు ఉండి.. ఆరోగ్యంగా ఉన్న వారిని అధికారులు ఇంటికి పంపిస్తున్నారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉన్న కేంద్రం నుంచి.. 2 సార్లు కరోనా నెగటివ్ ఫలితం వచ్చిన 48 మందిని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆధ్వర్యంలో డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఇంకా 1,211 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
క్వారంటైన్ కేంద్రం నుంచి 48 మంది డిశ్చార్జ్
కరోనా విజృంభిస్తున్నందున అధికారులు అప్రమత్తమవుతున్నారు. కర్నూలు జిల్లాలో 14 రోజులు క్వారంటైన్లలో ఉండి ఆరోగ్యంగా ఉన్నవారిని ఇంటికి పంపుతున్నారు.
కర్నూలులోని క్వారంటైన్ నుంచి 48మంది డిశ్చార్జ్