కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొత్తచెరువు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమేశ్ నాయక్ (32) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం... సుగాలిగట్టకు చెందిన రమేశ్ ఓర్వకల్ మండలం గుడుంబా తండాలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ద్విచక్రవానంపై వస్తున్నాడు. మార్గమధ్యంలో ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన రమేశ్ నాయక్‌ను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య రాదాబాయి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆటోను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి - crime news in kurnool district
ఆగి ఉన్న ఆటోను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో రమేశ్ నాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పాణ్యం మండలం కొత్తచెరువు సమీపంలో జరిగింది.
accident_