3వేల కిలోల బెల్లం స్వాధీనం... ముగ్గురు అరెస్ట్ - latest crime news in kurnool district
నంద్యాల సమీపంలోని నందమూరి నగర్ వద్ద అక్రమంగా బెల్లం తరలిస్తున్న వాహనాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 3వేల కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
3వేల కిలోల బెల్లం స్వాధీనం... ముగ్గురు అరెస్ట్
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నందమూరి నగర్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా బెల్లం తరలిస్తున్న వాహనాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు నుంచి నంద్యాల శివారులో నాటుసారా తయారీ చేసే బట్టీలకు బెల్లాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 3వేల కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ లలిత దేవి వివరించారు.