కర్నూలు జిల్లాలో ఇవాళ 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 4కు చేరాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 449 నమూనాల సేకరించామని కలెక్టర్ వివరించారు. దిల్లీ జమాత్‌కు వెళ్లిన 338 మంది నమూనాలు ల్యాబ్‌కు పంపినట్టు పాలనాధికారి వీరపాండియన్ వెల్లడించారు. ఇప్పటివరకు 90 మంది నమూనాల నివేదికలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. 90 మందిలో నలుగురికి పాజిటివ్, 86 మందికి నెగెటివ్ వచ్చాయని వివరించారు. కర్నూలు జిల్లాలో ఇంకా 350 మంది నమూనాల ఫలితాలు రావాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 167కు చేరింది.
కర్నూలు జిల్లాలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు - కర్నూలు జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కర్నూలు జిల్లాలో ఇవాళ 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 4కు చేరాయి.

కర్నూలు జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
TAGGED:
corona positive