శ్రీశైల జలశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జురాల నుంచి వరదనీరు భారీగా శ్రీశైలానికి చేరుతోంది. ఆనకట్ట 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 1.03 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 1.52 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులుండగా ఇప్పటికీ 884.80 అడుగులు నీటిమట్టంతో నిండుకుండలా మారింది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా వరదనీటితో ప్రస్తుత నీటి నిల్వ 214.36 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలంలో కొనసాగుతున్న వరద.. 3 గేట్లు ఎత్తివేత - heavy flood in srisailam
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలంలో భారీగా వరద చేరుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోగా.. ఆనకట్ట గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
![శ్రీశైలంలో కొనసాగుతున్న వరద.. 3 గేట్లు ఎత్తివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4744657-820-4744657-1571026291498.jpg)
heavy flood in srisailam
Last Updated : Oct 14, 2019, 12:26 PM IST