కర్నూలు జిల్లాలో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఈరోజు 29 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ వెల్లడించారు. కర్నూలు రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి నుంచి 9 మంది, విశ్వభారతి జిల్లా కొవిడ్ ఆసుపత్రి నుంచి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. 29 మందిలో 25 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 50 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉండి... బీపీ, షుగర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 11 మంది కరోనాను జయించినట్లు అధికారులు పేర్కొన్నారు.
కరోనాను జయించి 29 మంది డిశ్చార్జ్ - corona active cases news in kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 29మందిని డిశ్చార్జ్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 115 మంది వైరస్ బారినుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయినట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ వెల్లడించారు.
కరోనాను జయించి 29 మంది డిశ్చార్జ్
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో కర్నూలు నగర వాసులు 22 మంది, నంద్యాలకు చెందిన వారు ఇద్దరు, ఆత్మకురు నుంచి ఇద్దరు, కోడుమూరు, కృష్ణగిరి, తెలంగాణ రాష్ట్రం రాజోళి నుంచి ఒకొక్కరు డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. ఫలితంగా జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 115 చేరింది. పదిమంది కరోనాను జయించలేక మరణించినట్లు వెల్లడించారు.