కర్నూలు జిల్లా నుంచి మత ప్రార్థనల కోసం దిల్లీకి వెళ్లిన వారిలో 283 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. అనుమానితుల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించామని ఆయన వెల్లడించారు. లాక్డౌన్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను ఎంపీ సంజీవ్ కుమార్ తో కలిసి పంపిణీ చేశారు. ఇతర జిల్లాల నుంచి దిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
'క్వారంటైన్ కేంద్రాలకు 283మంది': కర్నూలు ఎస్పీ - lockdown updates
కర్నూలు జిల్లా నుంచి ప్రార్థనల కోసం దిల్లీకి వెళ్లిన వారిలో 283 మంది అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
'క్వారంటైన్ కేంద్రాలకు 283మంది': కర్నూలు ఎస్పీ