కర్నూలు జిల్లాలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేడు కర్నూలు జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల నుంచి 28 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇందులో 23 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. 60 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కరోనాను జయించడం విశేషం.
ఇప్పటి వరకు జిల్లాలో కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 267కు పెరిగింది. మిగతా 283 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనాతో 16 మంది మరణించారు.