కర్నూలు జిల్లాలో తాజాగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మహమ్మారి సోకిన మొత్తం బాధితుల సంఖ్య 60,144కు చేరింది. ఇప్పటివరకూ 59,470 మంది కరోనాను జయించి క్షేమంగా ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 189 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ కారణంగా జిల్లాలో మొత్తం 485 మంది మృత్యువాత పడ్డారు. ఇవాళ ఒక్కరు కూడా మరణించలేదని వైద్యాధికారులు వెల్లడించారు.
కర్నూలులో ఇవాళ 28 కేసులు నమోదు - కర్నూలు జిల్లా వైద్యధికారులు
కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరు కూడా మరణించలేదని వైద్యాధికారులు తెలిపారు.
కర్నూలులో కరోనా కేసులు