కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. జిల్లాలో నేడు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 6, ఆదోనిలో 5, కొయిలకుంట్లలో 4, పత్తికొండలో 3,ఉయ్యాలవాడలో 2, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, మద్దికెరలో ఒకొక్క కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి 52మంది డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కరోనాను జయించిన వారి సంఖ్య జిల్లాలో 783కి చేరింది.
కర్నూలులో కరోనా ఉగ్రరూపం... మరో 23 పాజిటివ్ కేసులు నమోదు - కర్నూలులో కరోనా కేసుల వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో ఇవాళ మరో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... వైరస్ నుంచి కోలుకుని 52 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో పెరుగుతోన్న కరోనా కేసులు