కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన తైక్వాండో క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఒకేసారి 21 బ్లాక్ బెల్ట్‌లు సాధించి రికార్డు సృష్టించారు. తైక్వాండోలో పలు అంశాల్లో నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకొని, ప్రతిభ, నైపుణ్యం ప్రదర్శించిన వారికే బ్లాక్ బెల్ట్ ఇస్తారు. గత నెలలో కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో వీరి ప్రతిభను గుర్తించిన నిపుణులు ఏకంగా 21 మంది చిన్నారులకు బ్లాక్ బెల్ట్ అందించారు. శిక్షకులు చంద్రమౌళి మాస్టర్ ఆధ్వర్యంలో రెండున్నరేళ్లుగా వీరు కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ఆ శిక్షణ ఫలితమే తమకు బ్లాక్ బెల్ట్‌లు వచ్చాయని క్రీడాకారులు తెలిపారు. అంతేకాకుండా పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఆళ్లగడ్డ టైక్వాండో క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు.
ఆళ్లగడ్డ క్రీడాకారులు.. బ్లాక్‌బెల్ట్ వీరులు - ఆళ్లగడ్డలో 21 మంది చిన్నారులకు బ్లాక్ బెల్ట్‌లు వార్తలు
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఆళ్లగడ్డ తైక్వాండో క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ పోటీల్లో ఏకంగా 21 మంది బ్లాక్ బెల్ట్‌లు సాధించి రికార్డు సృష్టించారు. విజేతలకు ఎమ్మెల్యే పతకాలు అందజేశారు.
జిల్లా టైక్వాండో అసోసియేషన్ పోటీల్లో 21 మంది బ్లాక్ బెల్ట్‌లు