ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుష్కర ఘాట్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు - కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు

పుష్కరాల్లో పాల్గొనే జనాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఆ సమయంలో యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించకపోతే రాష్ట్రం పరువు పోతుంది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాల్లో ఏమాత్రం అసౌకర్యం కలగకుండా 20 ఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

pushkara ghats
పుష్కర ఘాట్లు

By

Published : Oct 14, 2020, 4:54 AM IST

తుంగభద్ర పుష్కరాల కోసం నిర్మించ తలపెట్టిన 20 ఘాట్లకు రూ. 22.91 కోట్లను మంజూరు చేస్తూ.. ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో ఈ నిర్మాణాలు జరగనున్నాయి.

కృష్ణా పుష్కరాల కోసం నందికొట్కుూరు పరిధిలోని సంగమేశ్వర ఆలయం వద్ద నిర్మించిన ఘాట్ బాగానే ఉందని అధికారులు తేల్చారు. నవంబర్ 20 నుంచి 12 రోజుల పాటు జిల్లాలో జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details