కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 13 మందిని నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ జి.వీరపాండ్యన్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 56 మంది కోలుకొని డిశ్చార్చ్ అయినట్లు తెలిపారు. డిశ్చార్చ్ అయిన 13 మందిలో కర్నూలు నగరం-4, నంద్యాల - 2 పాణ్యం-1, బనగానిపల్లె-2, నందికొట్కూరు-1, ఆత్మకూరు-1, కోడుమూరు-1, బిలకల గూడూరు నుంచి ఒకరు ఉన్నారు.
కరోనా నుంచి కోలుకున్న 13 మంది డిశ్చార్జ్ - 13 people discharged from hospital who conquered Corona
కర్నూలు జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 13 మంది డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 56 మంది డిశ్ఛార్జ్ అయినట్లు కలెక్టర్ తెలిపారు.
![కరోనా నుంచి కోలుకున్న 13 మంది డిశ్చార్జ్ kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7011945-880-7011945-1588314289496.jpg)
కోవిడ్ నుంచి కోలుకున్న 13 మంది డిశ్చార్జ్