గత నెల 12వ తేదీన ముంబయి నుంచి వలస కూలీగా తిరిగి వచ్చిన మహిళ గర్భవతిగా ఉండగా... ఆమెకు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చింది. ఆ బాధితురాలిని నంద్యాల సమీపంలోని కోవిడ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఆసుపత్రిలో ఆమె మగ శిశువుకు జన్ననిచ్చింది. పుట్టిన పిల్లవానికి కరోనా నెగిటివ్ వచ్చింది.
కరోనా నుంచి కోలుకుని 12 మంది డిశ్చార్జి
కర్నూలు జిల్లాలో 12 మంది కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో ఓ బాలింత కూడా ఉంది.
corona
మంగళవారం తల్లికి సైతం కరోనా నెగిటివ్ అని ఫలితం రాగా.. ఆమెను ఆసుపత్రి నుంచి అధికారులు డిశ్చార్జ్ చేశారు. ఆమెతో కలిపి మొత్తం 12 మందికి కరోనా నయమైందని నిర్థరించుకున్నాక.. అందరినీ ఇంటికి పంపించారు. వీరితో కలిపి.. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా నుంచి పూర్తిగా కొలుకున్న వారి సంఖ్య 627కు చేరింది.