కరోనా బారిన పడిన కొందరు.. కోలుకున్నారు. కర్నూలు జిల్లాలోని శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి 12 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రత్యేక అధికారి కాంతారావు తెలిపారు.
వీరిలో నంద్యాలకు చెందిన 12 మందిలో 8 సంవత్సరాల బాలికతో పాటు ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని వివరించారు. వీరందరినీ ప్రత్యేక వాహనంలో వారి ఇళ్లకు చేర్చినట్లు తెలియజేశారు.