కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. డోన్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పట్టణంలోని రహదారులను పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. డోన్ నుంచి రాయల చెరువుకు డబుల్ లైన్ రహదారి, ఐటీ కళాశాలకు వసతి గృహం, రూ.4 కోట్లతో గుండాల చెన్న కేశవ స్వామి ఆలయ పునరుద్ధరణ, కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
డోన్‌లో 100 పడకల ఆస్పత్రికి మంత్రి బుగ్గన భూమి పూజ - latest news of kurnool dst
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని రుద్రాక్షగుట్టలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి బుగ్గన భూమి పూజ చేశారు. డోన్‌కు ఆస్పత్రి, నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు రాబోతున్నాయని మంత్రి తెలిపారు.
100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆర్థికమంత్రి