Yuvagalam Padayatra 200 Days Celebrations : యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం ఎదిగిందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. 200రోజుల పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, యువగళం బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన మంచి పనిని కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
TDP Sanghibhava Yatra: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 200 రోజులకు చేరుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) లో తెలుగుదేశం శ్రేణులు సంఘీభావ యాత్ర చేశారు. మంగళగిరి మండలం నవులూరు నుంచి ఎర్రబాలెం వరకు పాదయాత్ర నిర్వహించారు. యువగళం పాదయాత్రతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. రాక్షస పాలనను పారదోలి రామరాజ్యం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో తామంతా కష్టపడి పనిచేస్తామని నేతలు చెప్పారు.
Nara Lokesh Yuvagalam 200 Days : లక్ష్యం దిశగా.. శరవేగంగా..! 200 రోజుకు చేరిన లోకేశ్ యువగళం పాదయాత్ర
TDP Leaders Support for Lokesh Padayatra: గుంటూరు జిల్లాలో..గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర (Kovelamudi Ravindra) ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర (Padayatra) నిర్వహించారు. చంద్రమౌళినగర్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజల అండతో లోకేశ్ పాదయాత్ర ప్రభంజనంలా సాగుతుందని రవీంద్ర అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన జగన్ సర్కారుని ప్రజలు దించివేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
లక్ష్యం దిశగా.. శరవేగంగా..! 200 రోజుకు చేరిన లోకేశ్ యువగళం పాదయాత్ర
చిత్తూరు జిల్లాలో...టీడీపీ నేతలు స్థానిక మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ర్యాలీగా పలమనేరు మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకుని అన్నా క్యాంటీన్ (Anna Canteen) ఎదుట భారీగా బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి పలువురికి పంచి పెట్టారు. ఈ సందర్భంగా పూలు, టమాటాలతో ఏర్పాటు చేసిన యువగళం ఆర్ట్ పలువురిని ఆకట్టుకుంది. పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, రామచంద్ర నాయుడు, ఆర్బీసి కుట్టి, సుబ్రమణ్యం గౌడ్, నాగరాజు, నాగభూషణం, నాగి రెడ్డి,అమరనాథ రెడ్డి, నాగరాజు రెడ్డి పాల్గొన్నారు.
కోనసీమ జిల్లాలో..మలికిపురంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా పాదయాత్ర నిర్వహించారు మేళతాళాలతో తెలుగుదేశం పార్టీ మహిళలు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
200వ రోజు యువగళం పాదయాత్రలో ఉప్పొంగిన తల్లి ప్రేమ...
శ్రీ సత్యసాయి జిల్లాలో..మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మూడు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పట్టణ శివారులోని మెట్టబండ ఆంజనేయస్వామి ఆలయంలో నాయకులు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వరకు మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఎన్టీఆర్ కూడలిలో చేరుకున్నాక ఎన్టీఆర్ విగ్రహానికి (NTR Statue) పూలమాల వేసి.. కేక్ కట్ చేసి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపి కేక్ తినిపించుకున్నారు.
అనంతపురం జిల్లాలో..కళ్యాణదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు తలపెట్టిన పాదయాత్రకు తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చారు. కుందుర్పి మండల పరిధిలోని మహంతపురం ఆంజనేయస్వామి ఆలయం (Hanuman Temple) నుంచి మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి కూడా చిత్తూరు మండలంలో బసంపల్లి నుంచి సెట్టూరు మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు.
ప్రకాశం జిల్లాలో...కొండిపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో రాలీ నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో..మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మూడు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పట్టణ శివారులోని మెట్టబండ ఆంజనేయస్వామి ఆలయంలో నాయకులు పూజలు చేశారు.
అనంతపురం జిల్లాలో..కళ్యాణదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు తలపెట్టిన పాదయాత్రకు తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి కూడా చిత్తూరు మండలంలో బసంపల్లి నుంచి సెట్టూరు మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు.
ప్రకాశం జిల్లాలో...కొండిపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో రాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లాకూడేరు మండలం రామచంద్రపురం నుంచి గొటుకూరు వరకు టీడీపీ శ్రేణులు సంఘీభావ పాదయాత్ర చేశాయి.