ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ యువ కెరటాలు... ప్రయోగ కుసుమాలు - machilipatnam

ఇంజనీరింగ్... ప్రయోగాలకు సరైన వేదిక. సద్వినియోగం చేసుకుంటే ఇదో విజయ గీతిక. పట్టా చేతికి రాకముందే... సృజనాత్మకతకు పదును పెడుతోంది నేటి యువతరం. వినూత్న ఆలోచనలకు అధునాతన సాంకేతికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తోంది.

యువ కెరటాలు...

By

Published : May 14, 2019, 2:36 PM IST

ఈ యువ కెరటాలు... ప్రయోగ కుసుమాలు

ఇంజనీరింగ్ అంటే కొందరికి విజ్ఞానం. మరికొందరికి విలాసం. కొందరు సరికొత్త ప్రయోగాలతో మెరవాలనుకుంటే... ఇంకొందరు మాత్రం ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకుందాంలే.. అనుకుంటారు. ఇందులో మొదటి కోవకు చెందిన వారే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డీఎమ్మెస్ ఎస్వీహెచ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. అందరిలా కాకుండా తమకంచూ ఓ ప్రత్యేకత ఉండాలని పరితపిస్తున్నారు. నేర్చుకున్న విద్యలో ఆధునికత, సృజనాత్మకత జోడించి వినూత్న ప్రయోగాలకు తెరలేపుతున్నారు.
ఔరా... అనిపిస్తున్న ట్రాఫిక్ మేనేజ్​మెంట్ సిస్టం!
నిత్య జీవితంలో తమకు ఎదురైన చిన్నపాటి సమస్యల పరిష్కారమే ప్రయోగాలకు మూలంగా చేసుకున్నారు. ఇంటర్నెట్ సహా అధునాతన టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సరికొత్త పరికరాలను రూపొందించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు "ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్​మెంట్ సిస్టం" పేరిట ఓ వ్యవస్థ నెలకొల్పారు నలుగురు విద్యార్థులు. దీని ద్వారా ట్రాపిక్​ను సులువుగా నియంత్రించొచ్చు. సీట్ బెల్టు ధరిస్తేనే ముందుకు కదులుతుంది. మద్యం సేవించి వాహనమెక్కితే కారు ముందుకెళ్లదు.
చిన్నారులు కారులో ఇరుక్కుంటే...
చిన్నారులు కారులోనే ఉండిపోయి ఊపిరాడక చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలోచనల నుంచి పురుడు పోసుకుందే... "చైల్డ్ లెఫ్ట్ బిహైండ్ వార్నింగ్ సిస్టమ్ ''. దీన్ని కారులో బిగించాలి. దీంతో కారులో ఎవరైనా ఉండిపోతే సెన్సార్లు వెంటనే గుర్తిస్తాయి. కారు యజమాని, డ్రైవర్ సెల్​ఫోన్​కు హెచ్చరిక సందేశం వెళుతుంది. కారులో ఉన్న చిన్నారికి శ్వాస అందించేందుకు వీలుగా కారు అద్దం కొంచెం తెరచుకునేలా చేస్తుంది. కారులో నిర్ణీత ఉష్ణోగ్రత కంటే పెరిగితే ఆటో మెటిక్​గా ఏసీ ఆన్ అవుతుంది.
విద్యార్థుల్లో ఉన్న మేథోశక్తిని వెలికి తీసేందుకు ఖర్చుకు వెనకాడకుండా ప్రోత్సహిస్తోంది కళాశాల యాజమాన్యం.

ABOUT THE AUTHOR

...view details