పోలీసు వ్యవస్థపై తాము నమ్మకం కోల్పోయామని తెలుగుదేశం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని వైకాపా బాధితులంటున్నారు. తమను ఊర్లో నుంచి గెంటేసిందే పోలీసులేనని... అదే పోలీసులు ఇప్పుడు ఊర్లలో దిగబెడతామంటే ఎలా నమ్మేదని వారు అంటున్నారు. సొంత గ్రామాల్లోకి వెళ్లాక దాడులు చేస్తే... తమను కాపాడేది ఎవరని వారు ప్రశ్నించారు.
'పోలీసులే మమ్మల్ని గ్రామాల నుంచి గెంటేశారు' - వైకాపా బాధితులు
పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయామని వైకాపా బాధితులంటున్నారు. తెదేపా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులు.. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పారు.
!['పోలీసులే మమ్మల్ని గ్రామాల నుంచి గెంటేశారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4393323-598-4393323-1568097806000.jpg)
తమ సమస్యలనుచెపుతున్న బాధితులు