రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరి, కృష్ణా సహా పలు నదుల్లో వరద కొనసాగుతోందని... దీనివల్ల ఇసుక తీయలేకపోవడం వల్లే కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ విష ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఇసుక కొరత తాత్కాలికమేనని... త్వరలో ఇసుక కష్టాలు తీరుతాయన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సీఎం జగన్ అండగా ఉన్నారని అన్నారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారందరికీ ఇసుక పంపిణీ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం తగు కార్యాచరణతో ముందుకు వెళ్తుందని జోగి రమేష్ అన్నారు.
'ఇసుక కొరతకు... నదుల్లో వరద తీవ్రతే కారణం' - ఇసుక కొరతకు కారణం\
రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ విష ప్రచారం చేయడం సరైంది కాదని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. త్వరలో ఇసుక కష్టాలను తీరుస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే జోగి రమేష్