బీసీ, ఎస్సీ, ఎస్టీ ల్లాంటి అణగారిన వర్గాలకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా సీఎం జగన్ పెద్ద పీట వేస్తుంటే.. తెదేపా అడ్డుపడుతోందని మంత్రులు ఆరోపించారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా కృష్టా జిల్లాలోని గన్నవరం, బెంజిసర్కిల్ వద్ద మాట్లాడిన మంత్రులు తీవ్రస్థాయిలో తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు.
'చంద్రబాబు ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. వైకాపాను ఓడించలేరు' - వైకాపా బస్సుయాత్ర వార్తలు
చంద్రబాబు ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. వైకాపాను ఓడించలేరని మంత్రులు అన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా విజయవాడ బెంజిసర్కిల్‌లో మంత్రులు మాట్లాడారు. మహానాడు వేదికగా చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ysrcp ministers
మహానాడు వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. వైకాపాను ఓడించలేరని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి లాంటి కార్యక్రమాలను.. తమ ప్రభుత్వం వస్తే ఎత్తివేస్తామని చెబుతోందని ఆక్షేపించారు. దీన్ని తిప్పికొట్టాలని మంత్రులు సూచించారు. బస్సు యాత్ర నేపథ్యంలో బెంజ్ సర్కిల్ వద్ద పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.
ఇదీ చదవండి: