పామర్రులో పందుల పంచాయతీ... Pigs issue in pamarru: కృష్ణా జిల్లాలోని పామర్రు గ్రామంలో పందుల పంచాయితీ నెలకొంది. గ్రామస్థుల ఫిర్యాదుతో జనావాసాల్లో తిరుగుతున్న పందులను బంధించిన పంచాయతీ సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన పందుల యజమానులు దాడి చేశారు. బంధించిన పందులను విడిపించుకుపోయారు. వైకాపా నాయకుల ఒత్తిడితో.. దాడి చేసినవారిపై కేసు పెట్టేందుకు కూడా పంచాయతీ సిబ్బంది భయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాల కంటే వైకాపా నేతల ప్రయోజనాలే ముఖ్యమా అంటూ పలువురు గ్రామస్థులు పంచాయతీ అధికారులను ప్రశ్నించగా.. పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన ఉద్యోగులు మిన్నకుండిపోయారు. ఇళ్ల మధ్య పందులు తిరగకుండా చూస్తామని గ్రామస్థులకు తెలిపారు.
సిబ్బంది విధులకు ఆటంకం కల్గిస్తున్న వైకాపా నేత..
పామర్రు గ్రామ పంచాయతీ ప్రజలకు అసౌకర్యం కల్పించే పందులను నియంత్రించేందుకు పనిచేస్తున్న సిబ్బందికి.. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత ఒకరు ఆటంకం కల్గిస్తున్నారని స్థానికులు వాపోయారు. ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే పందుల నియంత్రణకు పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకుంటుంటే అధికార పార్టీ నేత వచ్చి అడ్డుపడటంతో గ్రామస్థులు చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా వైకాపా నేతలు ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. పంచాయతీ సిబ్బంది విధులకు ఆటంకం కల్గించే వ్యవహారమంతా ఎమ్మెల్యే కార్యాలయంలోని నేతల కనుసన్నల్లోనే జరగడం విశేషం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:Pigeons Betting: పావురాలను తీసుకొచ్చారు.. గాల్లో ఎగురవేశారు.. ఎందుకు ?