ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా.. 'ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు' అనే నినాదంతో పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్ పాదయాత్ర ప్రారంభించారు. గ్రామంలో వీధి వీధి తిరిగి కరపత్రాలు అందజేస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజల వద్దకు వెళ్తున్నారు. పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం భూషణగుల్ల గ్రామంలో పాదయాత్రలు చేపట్టారు.
'ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు'.. వైకాపా నేతల పాదయాత్ర - కృష్ణా జిల్లా తాజా వార్తలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా వైకాపా నేతలు ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు అనే నినాదంతో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారని అన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నారని నందిగామ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. సీఎం జగన్ ప్రజాసంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఎంఎల్ఏ నందిగామలోని పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనిలో భాగంగానే నందిగామ నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 190 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు.
TAGGED:
కృష్ణా జిల్లా తాజా వార్తలు