విజయవాడలో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు వరద ముంపు బారిన పడకుండా కృష్ణానదీ తీరం వెంట రక్షణ గోడ నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ. 125 కోట్లు మంజూరు చేయడంపై వైకాపా కృతజ్ఞత ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి హోదాలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయవాడ తూర్పు నియోజక వర్గ వైకాపా ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. కృష్ణలంకలోని స్క్రూ బ్రిడ్జి నుంచి కరకట్ట మీదుగా అభినందన ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పింఛన్లు రద్దు చేస్తున్నారని.. కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ సహా సంక్షేమ పథకాలు వర్తింప జేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రక్షణ గోడకు నిధులు మంజూరుపై వైకాపా హర్షం
విజయవాడను ముంపు నుంచి రక్షించడం సహా.. అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయంపై వైకాపా నేతలు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
వైకాపా కృతజ్ఞత ర్యాలీ