ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ దిమ్మెకు వైకాపా రంగులు.. ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలపై దాడి - ysrcp leaders attacked TDP activists at bommuluru

కృష్ణా జిల్లా బొమ్ములూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయటం.. తెదేపా, వైకాపా నేతలకు ఘర్షణకు దారి తీసింది. తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నేతలు ఘటనాస్థలిని పరిశీలించారు. కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. మహానాడు బ్యానర్లపై వైకాపా బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు.

ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు
ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు

By

Published : Jun 27, 2022, 7:57 PM IST

ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు .. ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల దాడి

కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం ఘర్షణకు దారి తీసింది. మినీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే ఈ ఘటన జరగడంతో తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నేతలు ఘటనాస్థలిని పరిశీలించారు. తెదేపా కార్యకర్తలు వైకాపా రంగులపై పసుపు రంగు వేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేసారు. కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని... మహానాడు బ్యానర్లపై వైకాపా బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. తెదేపా నేతలు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details