YSRCP Govt Neglecting Community Halls Construction: నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ప్రతి ప్రసంగంలో ఎక్కడా లేని ప్రేమను వారిపై కురిపిస్తున్నారు. మాటల్లో ప్రేమ చూపిస్తున్నారు కానీ చేతల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రం అడ్డుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, కాపు సామాజిక వర్గాల కోసం చేపట్టిన సామాజిక భవనాల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కృష్టా జిల్లా వాసులు అసహనం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో శిలాఫలాకాలకే పరిమితమైన సామాజిక భవనాలపై ప్రత్యేక కథనం మీ కోసం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సామాజికవర్గాల ప్రజల అవసరాల దృష్ట్యా.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అవనిగడ్డ నియోజకవర్గంలో సామాజిక భవనాల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాల్లో సుమారు 2 కోట్ల రుపాయలతో కాపు సామాజిక భవనాల నిర్మాణానికి 2018 అక్టోబర్ 10న ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Kapu Function Hall Construction Works Delay: కాపు కమ్యూనిటీ హాల్‌పై వైసీపీ సర్కార్ చిన్నచూపు.. ముందుకు సాగని నిర్మాణ పనులు
కోటీ 50 లక్షల రుపాయలతో కోడూరు, నాగాయలంక, పెదప్రోలు, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటశాల మండలాల్లో బీసీ భవన్ నిర్మాణాలకు ప్రభుత్వం 2019 జనవరి 21న మరో జీవో విడుదల చేసింది. నిధులు విడుదల చేసి శంకుస్థాపనలు చేసి టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించే సమయంలో ఎన్నికలు రావటంతో నిర్మాణాలు నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆయా సామాజిక భవనాల నిర్మాణాలను గాలికి వదిలేసింది. టీడీపీ నాయకులు వేసిన శిలాఫలకం తప్ప.. నాలుగున్నరేళ్లుగా గుప్పెడు మట్టి వేసిన దాఖలాలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భవనాల నిర్మాణానికి వేసిన శిలాఫలకాలు వైసీపీ నాయకులు పాలనను వెక్కిరిస్తున్నాయి. భవనాల నిర్మాణాలు చేపట్టకపోవటంతో.. ఆ స్థలాలు నిరుపయోగంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రతి సభలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ప్రసంగాలు చేస్తున్నారని.. కానీ వారి సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు.. వారికోసం ఒక్క భవనాన్నైనా నిర్మించారా అని ప్రశ్నించారు.
MLA Kotam: సీఎం మూడు సంతకాలను గుర్తు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఏమిటంటే?