నగర అభివృద్ధి అంశాలు.. ఎజెండాగా ఈ నెల 15న విజయవాడ కౌన్సిల్లో చర్చ జరగనుందని వైకాపా ఫ్లోర్ లీడర్, సత్య నారాయణ, అడపా శేషు తెలిపారు. 143 అంశాల ఎజెండాతోపాటు 103 అంశాలపై చర్చ జరుపుతామని తెలిపారు. పన్నుల పెంపుపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేశామన్నారు. 15వ తేదీన జరిగే కౌన్సిల్లో పన్నుల పెంపుకు సంబంధించిన అంశం చర్చ లేదన్నారు.
ప్రభుత్వం ఆస్తి ఆధారిత పన్నుల పెంపుకు సంబంధించి 198 జీవో రేపటి చర్చలో లేదని తెలిపారు. 198 జీవోపై 7 అంశాలను ప్రత్యేక కౌన్సిల్లో చర్చిస్తామన్నారు. పన్నుల పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. త్వరలోనే పన్నుల పెంపుపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకొని వెళతామని తెలిపారు.