అక్కాచెల్లెళ్ళు, ఆడపడుచులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మైలవరం వెలుగు కార్యక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు సున్నా వడ్డీ పథకానికి ప్రభుత్వం రూ.1400 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అక్కాచెల్లెళ్ళు, ఆడపడుచులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ - mylavaram ysr zero interest scheme news
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. అక్కాచెల్లెళ్లు, ఆడపడుచులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్