ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం..ఆటో డ్రైవర్లకు వరం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఆటో డ్రైవర్లకు వరమని... ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్​ మాట నిలబెట్టుకున్నారని అవనిగ్గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్​బాబు అన్నారు. అవనిగడ్డలో మొత్తం 140 మంది ఎంపిక అయ్యారని అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు.

ఆటో డ్రైవర్లకు వరంగా..వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం

By

Published : Oct 6, 2019, 11:22 PM IST

ఆటో డ్రైవర్లకు వరంగా..వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఆటో డ్రైవర్లకు వరమని..జగన్ ఇచ్చిన వాగ్ధానాల్లో సీఎం అయిన 4నెలలకే మాట నిలబెట్టుకున్నారని విజయవాడలో అవనిగ్గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను సీఎం పాదయాత్రలో పరిశీలించి వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అవనిగడ్డలో మొత్తం 140 మంది ఎంపిక అయ్యారని అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. వైఎస్​ఆర్ రైతు భరోసాకి ప్రభుత్వం రూ.2500 కోట్ల బడ్జెట్​ కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details