వైఎస్ఆర్ వాహన మిత్ర దరఖాస్తులకు గడువును పొడిగించినట్టు కృష్ణా జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి డ్రైవరుకు వాహన మిత్ర ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. ఈనెల 26 వరకు గడువు పెంచినట్లు పేర్కొన్నారు. అర్హత గల ప్రతి డ్రైవరుకు ఆర్థిక భరోసాగా 10వేల రూపాయలు అందిస్తామన్నారు.
డ్రైవర్లకు శుభవార్త.. వాహన మిత్ర గడువు పెంపు - డ్రైవర్లకు వాహన మిత్ర తాజా వార్తలు
వైఎస్ఆర్ వాహన మిత్రకు దరఖాస్తు గడువు తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు సూచించారు.
![డ్రైవర్లకు శుభవార్త.. వాహన మిత్ర గడువు పెంపు ysr vahana mitra scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7773892-652-7773892-1593141594708.jpg)
డ్రైవర్లకు శుభవార్త వాహన మిత్ర గడువు పెంపు