రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘వైఎస్‌ఆర్ రైతు భరోసా’ పథకం రెండో విడత నిధులు జమ చేసేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అన్నదాతలకు ఆర్థిక భరోసాను ఇస్తున్న ఈ పథకం.. పంట పెట్టుబడికి కీలకంగా మారుతోంది. అయితే చాలా మంది అవగాహన లేక పథకంలో చోటు దక్కించుకోలేక పోతున్నారు. గతేడాది జమ చేసిన రైతు భరోసాతో పాటు.. ఇటీవల జమ చేసిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ సైతం కొందరికి దక్కలేదు. ఏడాదికి రూ.13,500, అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించేలా దీనికి రూపకల్పన చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.6 వేలు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇస్తోంది. ఈ పథకంలో ఇప్పటికే పీఎం కిసాన్ కింద రూ.2వేలు జమైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 ఈనెల 15వ తేదీ జమ చేసేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు రావటంతో.. అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కృష్ణా జిల్లాలో మొత్తం 6.27 లక్షల రైతు ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఈనెల 5వ తేదీ వరకు పరిశీలన చేయగా 4.26 లక్షల ఖాతాలు ఆమోదం పొందాయి. మరో 13,355 పెండింగ్‌లో ఉన్నాయి. పీఎం కిసాన్ కింద గత ఏప్రిల్‌లో 3.74 లక్షల రైతులు రూ.2వేల చొప్పున ప్రయోజనం పొందారు. మరికొన్ని ఖాతాలు బ్యాంకింగ్ లాగిన్ ప్రక్రియలో ఉన్నాయి. గత ఏడాది లబ్ధిపొందిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఆ జాబితాలో పేర్లు లేని రైతులు మే 10 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ గడువు నిన్నటితో ముగిసింది.
జిల్లాలో పరిస్థితి..
రైతు ఖాతాలు : 6.27 లక్షలు
ఆమోదం పొందినవి : 4.26 లక్షలు(ఈ నెల 5వరకు)