ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైయస్​ఆర్​  కాపునేస్తంతో... 6 లక్షల మందికి లబ్ధి - వైయస్​ఆర్​  కాపునేస్తం పథకం వార్తలు

వైయస్​ఆర్​  కాపునేస్తం పథకం కింద 6 లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది . ఒక్కొక్కరికి ఏటా 15 వేల రూపాయలు అందించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనున్నారు

వైయస్​ఆర్​  కాపునేస్తంతో... 6 లక్షల మందికి లబ్ధి
వైయస్​ఆర్​  కాపునేస్తంతో... 6 లక్షల మందికి లబ్ధి

By

Published : Dec 9, 2019, 4:17 AM IST

వైయస్​ఆర్​ కాపునేస్తం పథకం కింద 6 లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఒక్కొక్కరికి ఏటా 15 వేల రూపాయలు అందించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనున్నారు . 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. కాపు నేస్తం విధివిధానాలపై త్వరలోనే ఉత్తర్వులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కుటుంబ ఆదాయం నెలకు 10 వేలు, పట్టణాల్లో 12 వేల రూపాయల లోపు ఉన్నవారు అర్హులుగా అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఉద్యోగ విరమణ పొంది పింఛను తీసుకుంటున్నా అనర్హులే. అలాగే సొంత కారు ఉండకూడదు . ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు. మూడెకరాల లోపు మాగాణి, పదెకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాల లోపు ఉండవచ్చని అధికారులు వివరిస్తున్నారు.

వైయస్​ఆర్​ కాపునేస్తంతో... 6 లక్షల మందికి లబ్ధి

ABOUT THE AUTHOR

...view details