దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందున... నియోజక వర్గ పరిధిలోని అన్ని స్థాయిల్లో ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని, సేవా కార్యక్రమాలను చేయాలని కోరింది. ఈ మేరకు పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి సందేశాలు పంపింది. అందరినీ సమన్వయపరుచుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వైఎస్ఆర్ జయంతి..ఘనంగా నిర్వహించాలని వైకాపా నిర్ణయం - latest news on ysrcp
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని వైభవంగా జరపాలని వైకాపా నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తలకు, ముఖ్య నాయకులకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం సందేశాలు పంపింది.
రేపు వైఎస్ఆర్ జయంతి
గుర్తింపు పొందిన రైతు నాయకులు, ఆదర్శ రైతులకు తోడ్పాటు అందించడం, సత్కార కార్యక్రమాలు చేయాలని తెలిపారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో గుంపులుగా కాకుండా, విమర్శలకు తావు లేకుండా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సూచించింది.
ఇదీ చదవండి: ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లో 55 పోస్టుల నియామకానికి అనుమతులు
Last Updated : Jul 8, 2020, 12:47 AM IST